రంపచోడవరం,అర్జున్ సమాచారం:
రంపచోడవరం ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థినులు ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారు.అండర్ 17 అథ్లెటిక్స్ సెప్టెంబర్ 30న జరిగిన షాట్‌పుట్‌లో పదో తరగతి విద్యార్థిని కె.సాయి మౌనిక రెండో స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది.అండర్14 రెజ్లింగ్: అక్టోబర్ 1న జరిగిన పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని కర్రీ శివలింగేశ్వరి మొదటి స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. 30 కిలోల్లో కోట్ల ఝాన్సీరాణి, 39 కిలోల్లో సోముల యామిని తేజ, 40 కిలోల్లో బుడిమల గంగోత్రి, 42 కిలోల్లో ఇల్లా కీర్తన, 46 కిలోల్లో కొడుతురు నందిని రెండో స్థానాలు సాధించారు.
అండర్ 17 రెజ్లింగ్ 53 కిలోల్లో అన్నిక జాస్మిన్, 61 కిలోల్లో సోముల లావణ్య రెండో స్థానాలు సాధించారు. విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు ఎం.ఝాన్సీరాణి, ఉపాధ్యాయులు, పీడీలు పి.శశికాంత్‌రెడ్డి, పి.సురేష్, పి.జి.నాగమణి అభినందించారు.
========================